నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 24 బస్తీ దరఖానాలను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మెరుగైన సేవలు అందించే విధంగా గత నెలలో కొన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో మరికొన్నింటిని ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. డివిజన్‌కు రెండు చొప్పున 30 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేవాల మేరకు జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికి తోడు మరో 24 బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
కాగా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలో పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిని మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ప్రారంభించనున్నారు.