అలిగి ఆలయం బయటే కూర్చొన్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అట్టహాసంగా సాగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 July 2024 7:45 AM GMTఅలిగి ఆలయం బయటే కూర్చొన్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అట్టహాసంగా సాగుతోంది. అయితే.. ఈ కల్యాణ మహోత్సవంలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని ఆలయం బయటే కాసేపు కూర్చున్నారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై వారు సీరియస్ అయ్యారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సెక్యూరిటీ లేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ ఎక్కువగా ఉందనీ.. కిక్కిరిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. అయితే.. ఆ తర్వాత అధికారులు కాసేపటికే అక్కడికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు సమాచారం. చివరకు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా మొదలు అయ్యాయి. మంగళవారం సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించున్నారు ఆలయ పూజారులు. ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. 11.34 గంటలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సముహూర్తమున వైభవగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అట్టహాసంగా సాగుతోంది. అయితే.. ఈ కల్యాణ మహోత్సవంలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని ఆలయం బయటే కాసేపు కూర్చున్నారు. pic.twitter.com/zVIskmJseu
— Newsmeter Telugu (@NewsmeterTelugu) July 9, 2024