Hyderabad: కరోనా అలర్ట్.. నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారికి పాజిటివ్
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలవరం రేపుతోంది.
By Srikanth Gundamalla
Hyderabad: కరోనా అలర్ట్.. నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారికి పాజిటివ్
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలవరం రేపుతోంది. కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా అంతమైపోయే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. తాజాగా కేరళలో జేఎన్-1 రకం వేరియంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొత్త వేరియంటా? లేక సాధరణ జ్వరమా తెలియక భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయా పేషెంట్ల టెస్టులను ల్యాబ్‌లకు పంపుతున్నారు వైద్యులు.
హైదరాబాద్‌లో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల బాబుకి కరోనా పాజిటివ్‌గా తేలింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు. అయితే.. ఆ పాపకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 5 రోజుల కిందట చిన్నారిని జ్వరంతో ఉండగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారనీ.. ఆ సమయంలో పాప ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడడ్డాడని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆ బాబుకి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని అన్నారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతోందనీ.. వెంటిలేటర్‌పై ముందుగా వైద్యం అందించినా.. ఇప్పుడు తొలగించామని చెప్పారు. ఆక్సిజన్ సాయంతో కోవిడ్ బారిన పడిన బాబు చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 20కి చేరాయి. గురువారం కోవిడ్ నుంచి ఒకరు కోలుకోగా.. 19 మంది ఐసోషలేషన్‌లో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వైద్యాధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. కరోనా వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తత అవసరం అని అంటున్నారు. మరోవైపు కరోనా బాధితుల కోసం చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. ఐసోలేషన్ బెడ్లను సిద్ధం చేస్తున్నారు.