హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండడంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఘర్షణలకు పాల్పడ్డవారిపై కేసులు పెట్టాం: శశాంక్ గోయల్
హుజూరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడా అంవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోలేదు. ఘర్షణలకు పాల్పడ్డవారిపై కేసులు పెట్టాం. కొన్ని చోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయి అని సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు.
ఓటేసేందుకు రావాలి : కిషన్ రెడ్డి
ఓటు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావాలని కిషన్ రెడ్డి ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఉన్నతమైన పాలన కోసం సమర్థుడికి ఓటు వేయాలని ఆయన సూచించారు.