జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. నేడు(బుధవారం) హనుమాన్ జయంతి సందర్భంగా అర్థరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కొండగట్టు కాషాయమయమయింది. ఇక ఆలస పరిసరాలు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
ఎండాకాలం కావడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు రావడంతో అంజన్నను దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.