Municipal Polls: మున్సిపల్ పోరులో ట్రాన్స్ జెండర్ విజయం
నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక సామాన్య ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి..
By - అంజి |
Municipal Polls: మున్సిపల్ పోరులో ట్రాన్స్ జెండర్ విజయం
నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక సామాన్య ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఏకంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను మట్టికరిపించి విజయం సాధించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) అఖండ విజయాన్ని అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై 109 ఓట్ల మెజారిటీతో కావేరి ఘనవిజయం సాధించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఒక ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్‌గా గెలవడం ఇదే తొలిసారి. ఎటువంటి పార్టీ అండదండలు లేకపోయినా, కేవలం తన సేవా దృక్పథం, స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధమే తనను గెలిపించాయని కావేరి ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
#Telangana--నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) గెలుపుపొందారు. pic.twitter.com/SQ33YkFCRX
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 13, 2026
చిట్యాల మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకే పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తున్నారు.