Telangana: హైకోర్టు న్యాయవాది ఇంటిపై పోలీసుల దాడి

హైదరాబాద్ నగరంలోని మల్‌పేటలోని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

By అంజి  Published on  10 July 2023 4:10 AM GMT
High Court lawyer Rapolu Bhaskar, Gudur police, NRI, Telangana news

Telangana: హైకోర్టు న్యాయవాది ఇంటిపై పోలీసుల దాడి

హైదరాబాద్: నగరంలోని మల్‌పేటలోని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాది ఇంట్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఏపూరి సుభాష్ రెడ్డి వ్యక్తిని(75) బలవంతంగా గుంజుకొని తీసుకెళ్తూ.. మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్‌స్టేషన్‌ సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయవాది ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లడం వివాదం రేపింది. గూడూరులో ఉన్న 5 ఎకరాల ఎన్‌ఆర్‌ఐకి చెందిన భూమిని స్థానిక రియల్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కొనేందుకు కుట్ర పన్నారని సమాచారం.

పలు మార్లు పీఎస్‌కు పిలిపించి ఎన్‌ఆర్‌ఐకి బెదిరింపులకు గురి చేశారు. ఆ తర్వాత రియల్టర్ ఫిర్యాదు మేరకు ఎన్‌ఆర్‌ఐ పై 120బీ, 116,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గూడూరు పోలీసులు 41 సీఆర్పీసి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసేందుకు న్యాయవాది ఇంటిపై దాడి చేశారు. ఎన్ఆర్ఐని గుంజుకుపోతున్న పోలీసులను న్యాయవాది భాస్కర్‌, తోటి న్యాయవాదులతో కలిసి ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటనపై ఈరోజు హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది వెల్లడించారు.

నిన్న అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఇంటి పై గూడూరు పోలీసులు దాడి చేశారు. తన క్లైంట్ సుభాష్ రెడ్డితో మాట్లాడుతున్న సమయంలో దౌర్జన్యంగా పోలీసులు ఇంట్లోకి వచ్చి సుభాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో న్యాయవాది రాపోలు భాస్కర్ కు పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం లో మలక్ పెట్ పోలీసులు జోక్యం చేరుకున్నారు. గూడూరు పోలీసులు సుభాష్ రెడ్డికి 41 crpc కింద నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. గూడూరు పోలీసుల చర్య పై హైకోర్ట్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ పై పోలీసుల దాడికి నిరసనగా నేడు విధులు బహిష్కరిస్తామని హై కోర్ట్ అడ్వకేట్స్ వెల్లడించారు.

Next Story