భద్రాద్రి ఆలయానికి హీరో ప్రభాస్ భారీ విరాళం

పాన్‌ ఇండియా నటుడు ప్రభాస్‌.. తెలంగాణలోని భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు.

By అంజి  Published on  14 May 2023 8:06 AM IST
Hero Prabhas, Bhadradri, Sitaramachandra Swamy temple,  Bhadrachalam

భద్రాద్రి ఆలయానికి హీరో ప్రభాస్ భారీ విరాళం

పాన్‌ ఇండియా నటుడు ప్రభాస్‌.. తెలంగాణలోని భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్‌, శ్రీనివాసరెడ్డి.. నిన్న ఆలయ ఈవో రమాదేవికి చెక్కు అందించారు. ఈ విరాళాన్ని అన్నదానం, గోశాల విస్తరన, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు. ఇక ఇందుకు సంబంధిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్‌ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, సినీ అభిమానులు.

రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన 'ఆదిపురుష్‌' సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్‌ నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే 'ఆదిపురుష్' సినిమా విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఓం రౌత్ డైరెక్షన్ లో.. ప్రభాస్‌ 'ఆది పురుష్‌' సినిమాలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా కాస్తా నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో.. కాస్త పాజిటీవ్ వేవ్ ను సాధించగలిగారు సినిమా టీమ్.

Next Story