Nizamabad: గుండెపోటు రోగి ఆత్మహత్య.. ఆస్పత్రి ఐదవ అంతస్తు నుంచి దూకి..

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఇన్‌ పేషెంట్‌ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి
Published on : 11 Dec 2024 8:37 AM IST

Heart Patient, Suicide, Nizamabad, Government General Hospital

Nizamabad: గుండెపోటు రోగి ఆత్మహత్య.. ఆస్పత్రి ఐదవ అంతస్తు నుంచి దూకి.. 

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఇన్‌ పేషెంట్‌ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌లోని నాగారంకు చెందిన మాట్ల లక్ష్మణ్ (50).. గుండె సంబంధిత సమస్యలతో జీజీహెచ్‌లో చేరాడు. వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ అయిన లక్ష్మణ్ గత ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అనారోగ్యం తీవ్రతరం కావడంతో జీజీహెచ్‌లో చేర్పించారు. మంగళవారం ఉదయం వైద్యులు పరీక్షించారు. లక్ష్మణ్ భార్య శకుంతల టీ తీసుకురావడానికి బయటికి వెళ్లింది. ఇంతలో లక్ష్మణ్ బెడ్‌ వదిలేసి బయటికి వెళ్లాడు.

ఆస్పత్రి ఐదవ అంతస్తు నుంచి దూకి లక్ష్మణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే లక్ష్మణ్‌ను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆత్మహత్య ఘటనతో జీజీహెచ్ ఆవరణలో భయాందోళన నెలకొంది. పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, లక్ష్మణ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అన్నారు. ఇన్‌పేషెంట్‌గా ఉన్న అతడు ఆసుపత్రి సిబ్బందితో సాధారణంగానే ప్రవర్తించాడని ఆమె తెలిపారు. విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడవుతాయని ఆమె తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story