ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుండెపోటు.. అక్కడే కుప్పకూలి..
గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 2:37 PM ISTఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుండెపోటు.. అక్కడే కుప్పకూలి..
గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాతిలో నొప్పితో ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. పక్కనే ఎవరైనా ఉండి వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తే కొందరు బతికి బయటపడుతున్నారు. లేదంటే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ ఫార్మసీ షాపులో పనిచేస్తున్న వ్యక్తికి ఉన్నట్లుండి గుండెపోటు వచ్చింది. దాంతో అతను అక్కడే కిందపడిపోయాడు. యువకుడు కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడిన దృశ్యాలు ఆ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
గుండెపోటు అంటే వయసు పైబడ్డ వారికే వస్తుందనే వాదన తప్పు అంటున్నారు. ప్రస్తుతం చిన్న వయసున్న పిల్లలు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. యువత అయితే జిమ్‌లో వర్కౌట్ చేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చనిపోయారు. మేడ్చల్ జిల్లాలోని కీసరలో కూడా ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. స్థానికంగా ఉన్న మెడ్స్ ఫార్మసీలో మురళి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన ఫార్మసీకి వచ్చిన వ్యక్తికి మందులు అందించాడు. ఆ తర్వాత బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మురళి గుండెపోటుతో కిందపడిపోవడంతో కంగారు పడ్డ మిగతా సిబ్బంది వెంటనే స్పందించారు. అతనికి సహాయ పడేందుకు ప్రయత్నించారు. కానీ... మురళి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్స్ పెడుతున్నారు. హార్ట్ ఎటాక్ ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందో తెలియడం లేదని అంటున్నారు. గుండెపోటుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం మంచిదంటున్నారు.
మేడ్చల్ జిల్లాలోని కీసర విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెడికల్ షాపులో బిల్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. pic.twitter.com/Yt4061DmHE
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 6, 2024