బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు కలవనున్నారు. ఈ కేసులో జూన్ 9న ఇది వరకే హరీష్ రావు కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. కాగా, మరింత సమాచారం అందించేందుకు ఆయన కొంత గడువు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు నేడు ఉదయం 11 గంటలకు కలవడానికి కమిషన్ సమయం ఇవ్వగా.. హరీష్ రావు కమిషన్ ముందు హాజరయ్యి, మరింత సమాచారం అందించనున్నారు. అయితే ఈ నెల 27 తర్వాత కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది