స్కూల్స్ హాఫ్ డే మాత్రమే.. ఎక్క‌డంటే..?

రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర ఉర్దూ మీడియం విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది.

By Medi Samrat  Published on  2 March 2025 3:49 PM IST
స్కూల్స్ హాఫ్ డే మాత్రమే.. ఎక్క‌డంటే..?

రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర ఉర్దూ మీడియం విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పాఠశాలల వేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉర్దూ మీడియం పాఠశాలల ఉపాధ్యాయులు, సమాంతర మీడియం పాఠశాలల ఉర్దూ మీడియం విభాగాలు, డైట్‌లలోని ఉర్దూ మీడియం విభాగాల ఉపాధ్యాయులు రంజాన్ 2025 సందర్భంగా పాఠశాల సమయాన్ని సగం రోజుకు మార్చాలని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక పత్రికా ప్రకటన ప్రకారం, TMREIS వైస్-ఛైర్మన్, ప్రెసిడెంట్, మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ రంజాన్ 2025 సందర్భంగా పాఠశాల సమయ మార్పు కోసం ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.

Next Story