అలర్ట్..తెలంగాణలో స్కూల్స్ సమయం మార్పు, సమ్మర్ హాలీడేస్ ప్రకటన

తెలంగాణలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 7:20 PM IST

Telangana Schools, Summer Vacations, HalfDay Schools, Telangana Education, School Holidays

అలర్ట్..తెలంగాణలో స్కూల్స్ సమయం మార్పు, సమ్మర్ హాలీడేస్ ప్రకటన

తెలంగాణలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.

మార్చి 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 24 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.

ఉర్దూ మీడియం పాఠశాలలకు ప్రత్యేక రాయితీ:

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ఉర్దూ మీడియం స్కూల్స్ సమయాల్లో మార్పులు చేశారు. ఈ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయి. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చని సూచించింది.

Next Story