తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ రీ-షెడ్యూల్‌ చేసింది.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 7:00 PM IST
Group-2 Exam, Re Schedule, Telangana, TSPSC,

 తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ రీ-షెడ్యూల్‌ చేసింది. అభ్యర్థుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తేదీలను కూడా టీఎస్‌పీఎస్‌సీ ఖరారు చేసింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది.

అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేసింది. ఆదివారం పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. తెలంగాణలోని 283 గ్రూప్‌-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి వరకు దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకి 705 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా.. మిగతా పోటీ పరీక్షలు రాసేవారికి ఇబ్బందులు పడుతున్నారంటూ అభ్యర్థులు ఆందోళన చేశారు. గన్‌పార్క్‌ వద్ద అఖిలపక్ష పార్టీల మద్దతుతో ధర్నా కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story