కాసేపట్లో పెళ్లనగా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వరుడి కారు, టెన్షన్..టెన్షన్
ఓ వరుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. మార్గమధ్యలో వరుడికి అనుకోని ఘటన ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 7 Sep 2023 9:43 AM GMTకాసేపట్లో పెళ్లనగా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వరుడి కారు, టెన్షన్..టెన్షన్
ఓ వరుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఇంకో గంటలో పెళ్లి అనగా.. ఇంటి నుంచి పెళ్లి వేదిక వద్దకు బయల్దేరాడు. అయితే.. మార్గమధ్యలో వరుడికి అనుకోని ఘటన ఎదురైంది. అతడు వెళ్తున్న రూట్‌లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముహూర్తం టైమ్‌కు పెళ్లి మండపానికి చేరుకుంటానో లేదో అని ఆ వరుడు టెన్షన్ పడ్డాడు. వరంగల్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే.. వరుడు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నుంచి తొర్రూరు బయల్దేరాడు. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండగా.. 9 గంటలకే ఇంటి నుంచి బయల్దేరాడు. అయితే.. ఇల్లంద గ్రామ శివారుకు రాగానే అనుకోని ఘటన ఎదురైంది. హైవేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాంతో.. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెళ్లి ముహూర్తం సమయానికి వెళ్తానో లేదా అని వరుడు టెన్షన్ పడ్డాడు. దాంతో.. స్వయంగా వరుడే కారు దిగి ట్రాఫిక్ పోలీసులను కలిశాడు.
త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ వరుడు అధికారులను వేడుకున్నాడు. అయితే.. అధికారులు అప్పటికే మూడు భారీ క్రేన్లతో ట్యాంకర్‌ను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కాస్త సమయం పడుతుందని.. అడ్జస్ట్ అవ్వాలంటూ చెప్పారు. దాంతో అసహనానికి గురైన వరుడు తిరిగి కారులో కొంత దూరం ప్రయాణించాడు. అయితే.. ఆలోపే ట్రాఫిక్ క్లియర్ అయ్యిందని తెలియడంతో మళ్లీ అదే రూట్‌లో తొర్రూర్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పెళ్లి మండపానికి చేరుకుని యథావిధిగా వివాహం చేసుకున్నాడు. అయితే.. ట్యాంకర్ బోల్తా వల్ల వరుడు కాసేపు టెన్షన్‌కు గురయ్యాడు.