Khammam: నిర్మాణ దశలోనే కూలిన గ్రీన్‌ఫీల్డ్‌ వంతెన

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై జనవరి 18వ తేదీ గురువారం వైరా మండలం సోమారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది.

By అంజి  Published on  19 Jan 2024 7:54 AM IST
Green field Road, Bridge Collapsed, Khammam, NHAI

Khammam: నిర్మాణ దశలోనే కూలిన గ్రీన్‌ఫీల్డ్‌ వంతెన

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై జనవరి 18వ తేదీ గురువారం వైరా మండలం సోమారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. నివేదికల ప్రకారం.. అండర్‌పాస్‌కు ఇరువైపులా వంతెన కాంక్రీట్ స్లాబ్‌ను మధ్యాహ్నం వేశారు. సాయంత్రం కూలీలు రోజు పని ముగించుకుని వెళ్లే సరికి స్లాబ్‌కు సపోర్ట్‌గా ఉన్న స్కాఫోల్డింగ్, మెటల్ షీట్లు కూలిపోయాయి. ముగ్గురు కార్మికులు స్వల్ప గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేయడంలో లోపాలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. కాగా కూలీలకు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్లాబ్‌ వేసిన గంటల వ్యవధిలోనే కూలిపోవడంతో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహిస్తోంది. ముఖ్యంగా, ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని ఐదు సివిల్ ప్యాకేజీలుగా విభజించారు, ప్యాకేజీ-1ని అమలు చేసే బాధ్యత ఢిల్లీలో ఉన్న హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌తో ఉంది. ఈ సంస్థ గంగా ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి కోసం అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది, ఇది యాక్సెస్-నియంత్రిత ఆరు-లేన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ నాయకుడు క్రిశాంక్ స్పందించారు. సంఘటన యొక్క వీడియోను పోస్ట్ చేసి, కాంట్రాక్ట్‌ను భారత ప్రభుత్వం సంస్థకు మంజూరు చేసిందని అన్నారు. "భారత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది, ఖమ్మంలో నిర్మిస్తున్న అదానీ-హెచ్‌జి ఇన్‌ఫ్రా గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ ఈరోజు కూలిపోవడంతో 4 మందికి తీవ్ర గాయాలయ్యాయి" అని బిఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

Next Story