రైతులకు గుడ్ న్యూస్.. పాత పద్ధతిలో రైతు భరోసా.. కోడ్‌ ముగియగానే ఖాతాల్లోకి నిధులు!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా (యాసంగి సీజన్) నిధుల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

By -  అంజి
Published on : 13 Feb 2026 7:26 AM IST

Rythu Bharosa 2026, Telangana Farmers News, Yasangi Rythu Bharosa, Revanth Reddy Farmer Scheme

రైతులకు గుడ్ న్యూస్.. పాత పద్ధతిలో రైతు భరోసా.. కోడ్‌ ముగియగానే ఖాతాల్లోకి నిధులు!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా (యాసంగి సీజన్) నిధుల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సాగు చేసే భూములకే రైతు భరోసా (ఎకరానికి రూ.6 వేలు) చెల్లించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం దానిపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సాగు భూములను గుర్తించేందుకు నిర్వహించిన శాటిలైట్ సర్వే ఆధారంగా కాకుండా, గత ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో లబ్ధి పొందిన రైతుందరికీ యథావిధిగా నిధులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దాదాపు 1.45 కోట్ల ఎకరాలకు సంబంధించి నిధులు విడుదల కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ (RBI) ద్వారా సుమారు ₹9,000 కోట్ల రుణాన్ని సేకరించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16తో (ఫిబ్రవరి 16, 2026) ముగియనుంది. కోడ్ ముగిసిన వెంటనే లేదా కొన్ని రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి ₹6,000 చొప్పున జమ చేసే అవకాశం ఉంది. కొత్త రైతుల నమోదు: భూముల క్రయవిక్రయాల ద్వారా కొత్తగా పట్టా పొందిన రైతుల వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే వ్యవసాయ విస్తరణాధికారులకు (AEOs) ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం తొలుత కేవలం "సాగులో ఉన్న భూములకు మాత్రమే" సాయం అందించాలని, ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ వాడాలని గట్టిగా అనుకుంది. దీనివల్ల దాదాపు 20 లక్షల ఎకరాలకు కోత పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, ఎన్నికల సమయం దృష్ట్యా, ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే అందరికీ నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story