విద్యార్థులకు గుడ్‌న్యూస్..హాఫ్ డే' స్కూల్స్, సమ్మర్ హాలిడేస్‌కి డేట్ ఫిక్స్!

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 17 Feb 2026 1:30 PM IST

Telangana Schools, Half Day Schools, Summer Holidays,  Student Alert, SSC Exams, Telangana Government

విద్యార్థులకు గుడ్‌న్యూస్..హాఫ్ డే' స్కూల్స్, సమ్మర్ హాలిడేస్‌కి డేట్ ఫిక్స్!

హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు సమ్మర్ హాలిడేస్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో టైమింగ్స్ వేరుగా ఉంటాయి. అక్కడ మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యధావిధిగా కొనసాగుతాయి. ఉర్దూ మీడియం స్కూళ్లకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వెసులుబాటు కల్పించారు.

సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే?

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవి సెలవుల డేట్ కూడా వచ్చేసింది. సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం అవుతాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్ అనగా కొత్త విద్యా సంవత్సరం జూన్ 12, 2026-27లో ప్రారంభమవుతుంది.

Next Story