తెలంగాణలో మందుబాబులకు లాక్ డౌన్ లో నో టెన్షన్.. ఆవేశపడకండి..!

Good News For Drinkers. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  11 May 2021 3:21 PM GMT
wine

తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటూ లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడ మద్యం కూడా దొరకదోనని మందు బాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టేశారు. కొత్తగా లాక్ డౌన్ ప్రకటన రావడంతో వైన్ షాపుల వద్దకు పరిగెత్తారు. చాలా వరకూ ఏరియాల్లో మద్యం బాటిళ్లను కొనడంపైనే ప్రజలు దృష్టి పెట్టారు. మద్యం దుకాణాలు తెరుస్తారో లేదో తెలియడంతో ఇప్పుడే కొనేస్తే బెటర్ కదా అని అనుకుని మద్యం షాపుల వద్దకు పరిగెత్తుతున్నారు. దీంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. సామాజిక దూరం పాటించకుండా కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. పోలీసులు చాలా ప్రాంతాల్లో మందుబాబులు క్యూలో నిలబడేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో 10రోజుల పాటు లాక్‌డౌన్ నేప‌థ్యంలో మందు దొరుకుతుందో లేదోన‌ని.. ముందు జాగ్ర‌త్త‌గా స్టాక్ పెట్టుకునేందుకు వైన్ షాపుల‌కు లైన్ క‌ట్టారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను లెక్క‌చేయ‌కుండా, సామాజిక దూరం పాటించ‌కుండా గుంపులు గుంపులుగా ఎగ‌బ‌డ్డారు.

అయితే మందుబాబుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచించింది. దీంతో ఈ వార్త విని అయినా మద్యం బాబులు ఆవేశపడి వైన్ షాపుల ముందు క్యూలో నిలబడడం ఆపేస్తారో లేదో చూడాలి.


Next Story