పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

Godavari express derailed near ghatkesar railway station. మెయింటనెన్స్‌ సమస్యో లేకా ఇంకేమైనా కారణమో తెలియదు కానీ..

By అంజి
Published on : 15 Feb 2023 7:35 AM IST

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

మెయింటనెన్స్‌ సమస్యో లేకా ఇంకేమైనా కారణమో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో రైళ్లు పట్టాలు తప్పుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మరో రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న 12727 నంబర్‌ గల గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో రైలు పట్టాలు తప్పంది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పట్టాలు తప్పిన బోగీలను వదిలి మిగిలిన బోగీలతో రైలుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఉపిరీపీల్చుకున్నారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కాజీపేట - సికింద్రాబాద్‌ రూట్‌లో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ప్రమాదానికి కారణమని సమాచారం. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది.


Next Story