Rajanna Sirisilla: గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త

డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

By అంజి  Published on  26 July 2024 7:02 PM IST
Ganja drinkers, Rajanna Sirisilla district, SP Akhil Mahajan

Rajanna Sirisilla: గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త

గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.ఐ లతో కలసి గంజాయి కిట్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించినవారు, వారికి సరఫరా చేసిన 8 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేయడం జరిగిందని, గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండలని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని, ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ గంజాయి తాగే వారిని గుర్తించడానికి అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే,గంజాయి టెస్ట్ లు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకోవడం జరుగుతుదన్నారు. జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని హెచ్చరించారు.

Next Story