వైఎస్‌ షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్‌

Gangula Kamalakar Comments On Sharmila Party. వైఎస్‌ షర్మిల పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు.

By Medi Samrat
Published on : 17 Feb 2021 7:49 AM IST

Gangula Kamalakar Comments On Sharmila Party.
వైఎస్‌ షర్మిల పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్‌ వదిలిన బాణం షర్మిల వస్తోందని, ఆ తర్వాత జగన్‌ కూడా వస్తారని ఆయన ఆరోపించారు. జగన్‌ వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణలో ఆంధ్ర పెత్తనం మళ్లీ మొదలవుతుందని, దీంతో కొట్లాటలు ప్రారంభమవుతాయని ముందస్తుగా హెచ్చరించారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవని, కేసీఆరే మన రక్షకుడన్నారు. అందుకే కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన కార్యకర్తలకు సూచించారు. మరో వైపు తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచిన వైఎస్‌ షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా వడివడిగా అడుగులు వేస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లా నేలతో సమావేశమైన షర్మిల.. తాజాగా హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్‌ఆర్‌ అభిమానులు, సానుభూతిపరులతో ఆమె సమావేశం అయ్యారు.


వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలుగా మెలిగిన నేతలు షర్మిల కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు చెప్పినప్పటికీ పూర్తిగా రాజకీయ అంశాలే భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్‌ అనుచరులుగా పేరొందిన నేతలకు షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తుండగా, షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.




Next Story