Gadwal: డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.

By Srikanth Gundamalla
Published on : 20 Jan 2024 6:44 AM IST

gadwal, road accident, three dead ,

 Gadwal: డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ సంఘటన గద్వాల పురపాలక సంఘం పరిధిలోని జమ్మిచేడు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గద్వాల పట్టణానికి చెందిన ఓ వైద్యుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఎర్రవల్లికి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇక కారు వేగంగా ఉండటంతో డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నరేశ్ (23) మల్దకల్, పవన్‌ కుమార్ (28) పెబ్బేరు, ఆంజనేయులు (50) గద్వాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా గద్వాలలోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగులు. ప్రమాదం గురించి స్థానికులుపోలీసులకు వెంటనే సమచారం అందించారు. దాంతో.. హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు పోలీసులు. కానీ.. ముగ్గురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక చనిపోయినవారిలో నరేశ్, పవన్‌ వారి కుటుంబాల్లో ఒకే సంతానం. దాంతో.. ఉన్న ఒక్క కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

Next Story