ఇవాళ పుట్టేవారికి 12 ఏళ్ల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

Free travel in Telangana RTC buses for those born today upto 12 years of age. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక నిర్ణయం

By అంజి
Published on : 15 Aug 2022 3:12 AM

ఇవాళ పుట్టేవారికి 12 ఏళ్ల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు (ఆగస్టు 15) రాష్ట్రంలో జన్మించే పసికందులకు 12 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సజ్జనార్‌ తెలిపారు. ఆదివారం నాడు నిజామాబాద్‌, బోధన్‌ ఆర్టీసీ బస్టాండ్లను సజ్జనార్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరూ 12 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేయొచ్చని తెలిపారు. అలాగే.. నేడు 75 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు నేటి నుంచి ఆగస్టు 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉచిత మెడికల్‌ చెకప్‌లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామని చెప్పారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 డిస్కౌంట్‌ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్‌ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు.

Next Story