విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్య

Four family members sucide in manchiryala.మంచిర్యాల జిల్లా కాసిపేట మండ‌లం మ‌ల్క‌ప‌ల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 3:22 AM GMT
Four family members sucide in manchiryala

మంచిర్యాల జిల్లా కాసిపేట మండ‌లం మ‌ల్క‌ప‌ల్లిలో విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మ‌ల్క‌ప‌ల్లి గ్రామానికి చెందిన రమేశ్‌, పద్మ దంపతులు ఓ గదిలో ఉరి వేసుకోగా.. మరో గదిలో వారి కొడుకు అక్షయ్‌ (17), కూతురు సౌమ్య (19)బ‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. కూతురు సౌమ్య ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది.

సౌమ్య అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.


Next Story
Share it