మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట విషాదం

Former MLA Daughter Mahalakshmi commits suicide.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2022 4:43 AM GMT
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న కుమార్తె మహాలక్ష్మి సారపాకలోని స్వగృహంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గురువారం తెల్ల‌వారుజామున ఇంట్లోని కుటుంబ స‌భ్యులు ఎంత‌కు గ‌ది త‌లుపులు తెర‌వ‌క‌పోవ‌డంతో త‌లుపులు ప‌గ‌ల‌కొట్టి చూడ‌గా.. మ‌హాల‌క్ష్మి ఉరికి వేలాడుతూ క‌నిపించింది. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెను ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌ట‌కే ఆమె మృతి చెందిన‌ట్లు వెద్యులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న తండ్రి తాటి వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా.. మ‌హాల‌క్ష్మీ ఇటీవ‌లే ఎంబీబీఎస్ పూర్తి చేసింద‌ని, పీజీ కోసం ప్రిపేరు అవుతోంది. క‌రీంన‌గ‌ర్‌లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో వైద్య విద్య‌ను అభ్య‌సించింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా.. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

Next Story
Share it