మాజీ మంత్రి హరీశ్‌ రావు మంచి మనసు.. ఇంటిని తాకట్టు పెట్టి మరీ..

సిద్దిపేటకు చెందిన మమత అనే వైద్య విద్యార్థిని చదువుకు సాయం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు తన ఇంటిని...

By -  అంజి
Published on : 19 Dec 2025 4:00 PM IST

Former Minister Harish Rao, education loan, poor student, mortgaging, PG medical education fees

మాజీ మంత్రి హరీశ్‌ రావు మంచి మనసు.. ఇంటిని తాకట్టు పెట్టి మరీ..

సిద్దిపేటకు చెందిన మమత అనే వైద్య విద్యార్థిని చదువుకు సాయం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు తన ఇంటిని తనఖా పెట్టారు. 'నాకు ఎంఎస్‌ ఆప్తామాలజీలో సీటు వచ్చింది. ఏడాదికి రూ.7.5 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.22.5 లక్షలు అవుతుంది. లోన్‌ తీసుకుందామంటే మా ఇంటిపై ఇది వరకే లోన్‌ ఉంది. ఈ విషయం హరీశ్‌ సర్‌కి చెబితే వారి ఇంటిపైనే మాకు లోన్‌ తీసి ఇచ్చారు. గతంలోనూ మా చెల్లెళ్లకి సాయం చేశారు' అని మమత పేర్కొన్నారు.

పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షల రూపాయలు కళాశాల యాజమాన్యం చెల్లించాలంది. దీంతో బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం.. హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని హరీష్ రావు బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి సైతం లక్ష రూపాయలు సహాయం చేశారు.

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా లోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేదనకు గురయ్యాడు. బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు.

తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవేశారు. విషయం తెలవగానే వెంటనే హరీష్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు. మొదటి సంవత్సరం హాస్టల్ కు లక్ష రూపాయలు అవుతుందని హరీష్ రావు దృష్టికి రాగ మళ్ళీ హాస్టల్ ఫిజు కు ఎలాంటి అప్పు చేయొద్దని ఆ లక్ష రూపాయలు కూడా నేనే చెల్లెస్తా అని హరీష్ రావు ఇచ్చారు.

Next Story