హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ.. ఎప్పుడంటే..

హైదరాబాద్‌లో ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 8:43 AM GMT
fish prasadam, Hyderabad,  June 8th ,

హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ.. ఎప్పుడంటే.. 

హైదరాబాద్‌లో ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని బత్తిని కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సాగుతుందని ఆకుటుంబం చెప్పింది. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపప్రసాదం అందిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వారు తెలిపారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా జూన్‌ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ చేపమందు పంపిణీ మొదలవుతుందని వారు చెప్పారు.

ఇక చేప ప్రసాదం పంపిణీ జూన్ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఆ తర్వాత రోజు జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగనుంది. చేప ప్రసాదం పూర్తిగా భక్తులకు ఉచితంగానే అందించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ఎప్పారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో.. మెడికల్ సర్వీస్‌, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా 24 గంటల పాటు భక్తులకు ఉచితంగానే అందుతాయని వారు పేర్కొన్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చూస్తుంటారు.

ఇక ఈ చేపప్రసాదాన్ని వివిధ అనారోగ్యాల నివారణకు తీసుకుంటుంటారు భక్తులు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు చేప మందును తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం అందించిన సహాయకారమే.. ఇప్పుడూ అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Next Story