కష్టానికి ప్రతిఫలం..బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకి కేటీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో శనివారం 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ -2024 వేడుక ఘనంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2024 9:56 AM IST
filmfare awards, ktr, congrats,  balagam movie, director venu,

 కష్టానికి ప్రతిఫలం..బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకి కేటీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో శనివారం 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ -2024 వేడుక ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ సంబరంలో పాల్గొన్నారు. తెలుగులో బలగం సినిమా అవార్డులను అందుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు.. ఉత్తమ డైరెక్టర్‌గా వేణు యెల్దండకు అవార్డులు దక్కాయి. కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శనలను దాదాపుగా అన్ని గ్రామాల్లో వేశారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాల నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ ప్రజలను ఆకర్షించింది. బంధాలు బాంధవ్యాలు కొనసాగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది బలగం చిత్రం. అయితే.. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో ఈ సినిమాకు గుర్తింపు దక్కి అవార్డులు లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలగం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బలగం.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ దక్కించుకోవడం పట్ల కేటీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. బలంగా సినిమా దర్శకుడు, చిత్ర బృందాన్ని ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు వేణు యెల్దండిని అభినందించారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలమని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని సాధించే ఇది తొలిమెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Next Story