'విఫల ప్రేమ నేరం కాదు'.. ప్రేమలో విడిపోవడంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ 'మోసం' కిందకు రాదని, ఆదిలోనే మోసం చేయాలనే దురుద్దేశం ఉంటే తప్ప దానిని నేరంగా పరిగణించలేమని...

By -  అంజి
Published on : 4 April 2026 6:42 AM IST

High Court Judgement on Love Failure, Breach of Marriage Promise Not a Crime, Section 420 IPC Love Cases, Justice N Tukaramji Ruling, Personal Relationships and Legal Crimes, Peddapalli District Court Case Quashed, Supreme Court Precedents on Marriage Promises

'విఫల ప్రేమ నేరం కాదు'.. ప్రేమలో విడిపోవడంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు 

ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ 'మోసం' కిందకు రాదని, ఆదిలోనే మోసం చేయాలనే దురుద్దేశం ఉంటే తప్ప దానిని నేరంగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలానికి చెందిన కె. సంతోష్ అనే యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ ఎన్. తుకారాంజీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసు నేపథ్యం మరియు కోర్టు పరిశీలన:

బాధిత యువతి ఫిర్యాదు ప్రకారం.. సంతోష్ 2018లో తనను ప్రేమించాలని కోరాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించాడని పేర్కొన్నారు. అయితే చివరకు పెళ్లికి నిరాకరించి, పరిహారం ఇస్తానని చెప్పడం మోసమేనని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను (ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర వంటివి) ప్రస్తావించారు.

ప్రేమాయణం ప్రారంభమైన సమయంలోనే అవతలి వ్యక్తిని మోసం చేయాలనే సంకల్పం ఉన్నట్లు ఆధారాలు ఉంటేనే అది ఐపీసీ సెక్షన్ 420 (మోసం) కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఐదేళ్ల సుదీర్ఘ కాలం పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇది కేవలం వివాహ వాగ్దాన ఉల్లంఘన (Breach of Promise) మాత్రమే తప్ప, క్రిమినల్ నేరం కాదని తేల్చిచెప్పింది. వ్యక్తిగత సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని చట్టపరమైన నేరాలుగా చిత్రీకరించడం సరికాదని, అలాంటి కేసులను కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడుతూ నిందితుడిపై ఉన్న కేసును కొట్టివేసింది.

Next Story