ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం

Etela Rajender team narrow escape from flight accident.మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ బృందానికి పెను ప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 5:25 AM GMT
ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ బృందానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈట‌ల బృందం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. పైలెట్ అల‌ర్ట్ అవ్వ‌డంతో తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై ఉండ‌గా సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే టైంలో అప్ర‌మ‌త్త‌మై ఫైలెట్ విమానాన్ని ఆపేశాడు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కాసేప‌టి క్రిత‌మే ఈటల రాజేంద్ర బృదం బయలుదేరింది. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్న‌ట్లు స‌మాచారం.

సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ, ఓయూ జేఏసీ నేత‌లు బీజేపీలో చేరారు. అనంత‌రం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ఈటెల అండ్ టీమ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసింది. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. విశ్వాసాన్ని వ‌మ్ముచేయ‌కుండా తాను తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తాన‌ని అన్నారు. తెలంగాణ‌లో బీజేపీని అన్ని గ్రామాల‌కు విస్త‌రించ‌డానికి తాను కృషి చేస్తాన‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు స‌హాయం చేస్తాన‌ని వెల్ల‌డించారు. బీజేపీలోకి స్వాగ‌తం ప‌లికిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలుతెలియ‌జేశారు.

Next Story