మూడు రోజుల పాటు వైన్స్, బార్లు బంద్
మందు బాబులు మీకు మరో బ్యాడ్ న్యూస్.. ఈ వీక్ మీరు ముందుకు కాస్త దూరంగా ఉండాల్సిందే!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 8:49 AM ISTమూడు రోజుల పాటూ వైన్స్, బార్లు బంద్
మందు బాబులు మీకు మరో బ్యాడ్ న్యూస్.. ఈ వీక్ మీరు ముందుకు కాస్త దూరంగా ఉండాల్సిందే!! ఎందుకు అని అడిగితే.. ఇట్స్ ఎలక్షన్స్ టైమ్ అనే సమాధానం అధికారుల నుండి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్ 3న ఉదయం 6 గంట ల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టార్ హోటల్స్, పబ్బులు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరాను నిలిపివేయనున్నారు. అయినా కూడా ఈ సమయంలో మద్యం ఎవరి దగ్గర దొరుకుతుందో మందు బాబులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!!
ఇక ఎన్నికల సమయంలో అక్టోబరు 9 నుంచి నవంబరు 24 నాటికి తెలంగాణ ఆబ్కారీ శాఖ రూ.113.73 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాల్ని జప్తు చేసింది. ఆ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్ మాట్లాడుతూ 1279 మద్యం దుకాణాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించి పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. 173 షాడో బృందాలను, ఆబ్కారీ సంబంధ నేరాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 44 బృందాలను రంగంలోకి దించామన్నారు.