బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని గెలిపిస్తే జైత్ర యాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ ముజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజకీయంగానే కాదు.. స్థానికంగానూ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈ కామెంట్స్‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. ఎన్నికల ప్రచారం చివరి రోజు పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తనని గెలిపించకపోతే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటానని హెచ్చరించారు. తనకు గెలిపించకపోతే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తుందని అన్నారు. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని లేదంటే డిసెంబర్ 4న శవయాత్రకు రావాలని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో.. ఆయన ఓటర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై పూర్తి స్థాయి దర్యాప్తునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.