మునుగోడు ఉప ఎన్నిక‌.. మాజీ ఆర్వో స‌స్పెండ్‌

Election Commission of India suspends former RO KMV Jagannadha Rao of Munugode.మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2022 4:33 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక‌.. మాజీ ఆర్వో స‌స్పెండ్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా మునుగోడు ఉప ఎన్నిక గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మునుగోడులో ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా అది పెద్ద ఇష్యూ అవుతోంది. గురువారం మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల మాజీ అధికారి కేఎంవీ జ‌గ‌న్నాథ‌రావును స‌స్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ముంద‌స్తు అనుమ‌తి లేకుండా, లేని అధికారాన్ని వినియోగించి మునుగోడులో ఓ అభ్య‌ర్థికి కేటాయించిన గుర్తును జ‌గ‌న్నాథ‌రావు మార్చ‌టం ఇటీవ‌ల వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు అందాయి. విచార‌ణ అనంత‌రం జ‌గ‌న్నాథ‌రావును బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. మ‌రో అధికారిని ఆయ‌న స్థానంలో నియ‌మించింది. తాజాగా జ‌గ‌న్నాథ‌రావును స‌స్పెండ్ చేసింది. అంతేకాకుండా త‌మ ఆదేశాలు తక్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

ఆయ‌న‌తో పాటు ఎన్నిక‌ల అధికారికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌లం అయిన డీఎస్పీపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాల్లో తెలిపింది. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో త‌మ‌కు తెలియ‌జేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించిన‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. అంతేకాకుండా జ‌గ‌న్నాథ రావును స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసి శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా ఢిల్లీకి పంపాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు.

Next Story