ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు
ED Issues summons to MP Nama Nageswara Rao.టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ)
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2021 9:33 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. నామా నాగేశ్వరరావుతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు పంపింది. బ్యాంకు రుణాలను వేరే సంస్థలకు మల్లించిన కేసులో నామా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ కేసులోనే ఈడీ ఇటీవలే నామా ఇంటిపైన, కార్యాలయాలపైన దాడులు చేశారు. రెండు రోజులపాటు మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును ఈడీ స్వాదీనం చేసుకున్నది. స్వాదీనం చేసుకున్న దస్త్రాలు, ఖాతాలు, హర్డ్ డిస్క్‌లను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు అనంతరం విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈడీ నోటీసులో పేర్కొంది. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు మధుకాన్ గ్రూప్‌లపై ఈడీ అభియోగాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.