ఈసీ కీలక నిర్ణయం.. రైతుబంధు డబ్బుల పంపిణీపై యూటర్న్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగునున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  27 Nov 2023 4:16 AM GMT
EC, Uturn,   Rythu Bandhu, telangana,

 ఈసీ కీలక నిర్ణయం.. రైతుబంధు డబ్బుల పంపిణీపై యూటర్న్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగునున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రైతుబంధు నిధుల పంపిణీకి ఇప్పటికే అనుమతి ఇచ్చిన ఈసీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా.. రైతుబంధు డబ్బులు పంపిణీ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారి. దాంతో.. రైతుబంధు డబ్బుల పంపిణీ విషయంలో ఎలక్షన్‌ కమిషన్ యూటర్న్‌ తీసుకున్నట్లు అయ్యింది.

తెలంగాణలో నవంబర్‌లోనే రబీ సీజన్‌ పంటకు రైతుబంధు నిధులు జమ చేయాల్సి ఉంది. కానీ.. ఆలోపే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాంతో.. రైతుబంధు పంపిణీ చేయకూడదని మొదట్లోనే చెప్పింది. కానీ.. అనూహ్యంగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దాంతో.. బీఆర్ఎస్‌కు బిగ్‌ బూస్ట్‌ అవుతుందని అనుకున్నారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు రైతుబంధు నిధులు జమ అవుతే.. పార్టీకి పాజిటివ్‌గా రెస్పాన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈలోపే రైతుబంధు పంపిణీ నిర్ణయంపై ఎన్నికల సంఘం యూటర్న్‌ తీసుకుంది. దాంతో బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి షాక్‌ తగినట్లు అయ్యింది. కాగా.. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈసీ రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్, బీజేపీలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. విపక్షాలు తీవ్రంగా రియాక్ట్ కావడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాయి. దీంతో రైతుబంధు పంపిణీపై ఈసీ యూటర్న్ తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది.

Next Story