ఆగిన చోటు నుండే అడుగులు మొదలు.. ఈటల‌

Eatala Rajender feeling unwell.ప్రజాదీవెన యాత్ర‌లో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్ అస్వస్థతకు గురైన సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2021 7:44 AM IST
ఆగిన చోటు నుండే అడుగులు మొదలు.. ఈటల‌

ప్రజాదీవెన యాత్ర‌లో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్ అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా 12వ రోజు వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటల అస్వస్థతకు గురవ్వడం నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. ఈటలకు వైద్యుల పరీక్షల్లో బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదయ్యింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపి వేశారు. ఉన్నత వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ తరలించాలని డాక్టర్స్ సలహా ఇచ్చారు. దాంతో ఈటలను హైదరాబాద్ కి త‌ర‌లించారు.

పన్నెండు రోజులుగా,222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను. అంటూ ఈట‌ల రాజేంద‌ర్ ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు.

ఈట‌ల ఈ నెల 19న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపూర్ మండ‌లం నుంచి ప్ర‌జాదీవెన యాత్ర‌ను మొద‌లు పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 222 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర సాగింది. ఈట‌ల అనారోగ్యానికి గురైన విష‌యం తెలుసుకున్న ప‌లువురు బాజాపా నేత‌లు ఆయ‌న‌కు ఫోన్ చేసి ఆరోగ్య ప‌రిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈట‌ల‌కు బాజాపా అండ‌గా ఉంటుంద‌ని, అధైర్య ప‌డొద్ద‌ని కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు.

Next Story