ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ

e-Pass must for inter-State travel. వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు

By Medi Samrat
Published on : 12 May 2021 7:42 AM IST

E pass

వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తెలియ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు మాత్రమే పాస్ లను జారీ చేస్తారని తెలిపారు.

అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్ లు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్నవెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని తెలిపారు.


Next Story