సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి మృతి
Dumpers collided in Singareni one dead.ఇటీవల సింగరేణిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికులు
By తోట వంశీ కుమార్ Published on
23 Dec 2021 7:09 AM GMT

ఇటీవల సింగరేణిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీనివాస్ మృతి పట్ల సింగరేణి సిబ్బంది నివాళులర్పించారు.
Next Story