Telangana: డీఎస్సీ నోటిఫికేషన్.. ఈనెల 20 నుంచి దరఖాస్తులు

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్ విడుదలైంది.

By Srikanth Gundamalla
Published on : 8 Sept 2023 9:18 AM IST

DSC Notification Telangana TRT

Telangana: డీఎస్సీ నోటిఫికేషన్.. ఈనెల 20 నుంచి దరఖాస్తులు

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5,089 స్కూల్‌ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ పరీక్షలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో నిర్వహించనున్నారు.

బీఎస్సీ నోటిఫికేషన్‌లో మొత్తం 5,089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్ 1,739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి. బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు అదికారులు. సెప్టెంబర్ 20న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుండగా.. చివరితేదీ అక్టోబర్ 21. ఇక ఆన్‌లైన్‌లో పరీక్షలు ఉంటాయి. ఇవి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతాయి. మరిన్ని పూర్తి వివరాకలు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Next Story