టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీకుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 1:00 PM ISTటీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీకుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎంఐఎం చార్మినార్ స్థానాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ఇంకా 63 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే లీడింగ్ చూస్తే కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌ను దాటింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌రెడ్డిని డీజీపీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. డీజీపీ అంజనీకుమార్‌తో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని కలిసి అభినంధించినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్‌రెడ్డికి కూడా పోలీసులు భద్రత పెంచారు. మరోవైపు కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఇంటికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. సంబరాలు చేస్తున్నారు. డీజీపీ కలిసిన తర్వాత కాసేపటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గాంధీ భవన్‌కు బయల్దేరివెళ్లారు.
రేవంత్‌రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ pic.twitter.com/ZR45Ij37go
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 3, 2023