రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే డిసీసీ అధ్యక్షుల నియామకం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కాగా సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల చివరి వరకు డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. అటు రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య వివాదాలు, బీసీ రిజర్వేషన్లపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ చర్చించనున్నారు.