పల్లె వెలుగు బస్ లో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం నాడు ఖమ్మంలో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

By M.S.R  Published on  13 Jun 2024 1:30 PM IST
Deputy CM Bhatti, Palle Velugu Bus, Telangana, Khammam

పల్లె వెలుగు బస్ లో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం నాడు ఖమ్మంలో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులతో మాట్లాడి ఉచిత బస్సు సర్వీసులు, ప్రభుత్వ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. బుధవారం సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ మండలం జగన్నాధపురం గ్రామానికి వెళ్లారు. వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించారు. బస్సు ఎక్కగానే సామాన్యుడిలా టికెట్ కొన్నారు. బస్సులోని ప్రయాణికులు కూడా ఒక్కసారిగా మంత్రిని చూసి ఆశ్చర్యపోయారు.

ఉచిత సేవలందించడం వల్ల కొంత డబ్బు ఆదా చేసుకోగలిగామని మహిళలు మంత్రికి తెలియజేశారు. అనంతరం అయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఈ సౌకర్యంతో చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సేవలను అందించేందుకు ఆర్టీసీ 300కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేసిందని.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

Next Story