ఉగాది రోజున గద్దర్‌ అవార్డుల ప్రదానం: డిప్యూటీ సీఎం భట్టి

గద్దర్‌ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

By అంజి  Published on  2 March 2025 1:45 PM IST
Deputy CM Bhatti Vikramarka, Gaddar awards, Ugadi

ఉగాది రోజున గద్దర్‌ అవార్డుల ప్రదానం: డిప్యూటీ సీఎం భట్టి

గద్దర్‌ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు నిర్వహించి, నాటకాలను ప్రదర్శించే కళాకారులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి గద్దర్‌ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆదివారం (మార్చి 2) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మంత్రి సీతక్క జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ''శ్రీ భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది సంగీత విద్వాంసులుగా వాగ్దాయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న. ప్రజా ప్రభుత్వం కళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకువెళ్లే వారికి అన్ని వసతులు కల్పిస్తాం'' అని తెలిపారు.

Next Story