ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

DA hiked for Telangana govt employees.తెలంగాణ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేసీఆర్ స‌ర్కార్‌ శుభ‌వార్త

By M.S.R  Published on  20 Jan 2022 12:24 PM IST
ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేసీఆర్ స‌ర్కార్‌ శుభ‌వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల క‌రువు భ‌త్యం (డీఏ)ను పెంచుతూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది.

ఇక పెరిగిన డీఏ 2021 జూలై నుంచి వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.300 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగులద‌రికీ డీఏ పెంచాల‌ని ఇటీవ‌ల జ‌రిగిన కేబినేట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. సాధారణంగా రాష్ట్ర ఉద్యోగులకు ప్రతి ఆరునెలలకు ఒకసారి డీఏను ప్రకటించాల్సి ఉంది. అయితే కరోనా కార‌ణంగా గ‌త రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏను పెంచ‌లేదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల‌ను ఒకే సారి ప్ర‌క‌టించాల‌ని కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. విశ్రాంత ఉద్యోగుల‌కు కూడా డీఏ జూన్ నెల నుంచి వ‌ర్తించ‌నుంది.

Next Story