సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
By - అంజి |
సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
హైదరాబాద్: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజ్‌లు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు. ఏవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930కు కాల్ చేయండి.
జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దువాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.సైబర్ నేరగాళ్లకు మీ… pic.twitter.com/AuvB7XzLXr
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 25, 2025
''జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు.. వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి'' అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు.