సైబర్ నేరాలపై రైతులకు పోలీసుల అలర్ట్, వీడియో ట్వీట్ చేసిన డీజీపీ
తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 11:45 AM IST
సైబర్ నేరాలపై రైతులకు పోలీసుల అలర్ట్, వీడియో ట్వీట్ చేసిన డీజీపీ
తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా రూ.లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ పోలీసులు రైతులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు, పేరు సహా బ్యాంకు అధికారుల ఫొటోలతో వాట్సాప్ అకౌంట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని లింక్స్ పంపి క్లిక్ చేయాలని చెబుతూ.. నేరాలకు పాల్పడుతున్నారని అలర్ట్ చేశారు.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఎలాంటి లింక్స్ వచ్చినా.. వాటిని క్లిక్ చేసి.. డౌన్‌లోడ్ చేసుకుని చిక్కుల్లో పడొద్దని పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా నేరగాళల్ నియంత్రణలోకి వెళ్లిపోతామని అన్నారు. ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు సైతం మెసేజ్‌లు వస్తాయనీ సూచిచంచారు. డబ్బులను కొల్లగొట్టే ప్రమాదం ఉంటుందనీ చెబుతుననారు. గూగుల్ పే, ఫోన్‌పై నెంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని అన్నారు. ఎవరి ఫోన్ చేసి ఓటీపీలు, ఇతర వివరాలు అడిగితే చెప్పొద్దని అన్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురి అయితే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయి. వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకండి. అలాంటి వాటిని క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెప్పకండి.#FakeURLs #CyberAlert #CyberFrauds pic.twitter.com/DfTXLVzdgy
— Telangana Police (@TelanganaCOPs) July 18, 2024
మరోవైపు తెలంగాణ డీజీపీ కూడా ఇలాంటి మోసాన్నే వీడియో ద్వారా బయటపెట్టారు. రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. ఎక్స్‌లో వీడియో షేర్ చేశారు. అపరిచుతల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు డీపీ పెట్టుకుని కాల్ చేసి బురిడీ కొట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తారని.. డీజీపీ జితేందర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సైబర్ నేరగాడు పోలీసు అధికారి పేరుతో ఓ వ్యక్తికి చేసిన ఫోన్ కాల్ వీడియోను డీజీపీ షేర్ చేశారు.
#CyberFraudAlert #FakePoliceCall
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 19, 2024
ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి… pic.twitter.com/9tO9T7TJZ2