9168 గ్రూప్‌-4 ఉద్యోగాలు.. భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై సీఎస్ స‌మీక్ష‌

CS Somesh Kumar Review on Group 4 Recruitment.తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1, పోలీస్ ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 4:39 PM IST
9168 గ్రూప్‌-4 ఉద్యోగాలు.. భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై సీఎస్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1, పోలీస్ ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్లు విడుద‌ల‌ కాగా.. తాజాగా గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. గ్రూప్-4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. గ్రూపు-4 ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు.

గ్రూపు-4 ఉద్యోగాల‌కు సంబంధించి రోస్ట‌ర్ పాయింట్లు స‌హా అవ‌స‌ర‌మైన వివ‌రాలు, స‌మాచారాన్ని ఈ నెల 29 లోపు టీఎస్‌పీఎస్సీకి పంపాల‌ని సీఎస్ ఆదేశించారు. జూనియ‌ర్ అసిస్టెంట్, స‌మాన స్థాయి పోస్టుల ఖాళీల‌న్నింటినీ నోటిఫికేష‌న్లో చేర్చాల‌ని, ప‌దోన్న‌తుల ద్వారా ఏర్ప‌డే ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. పోస్టుల భ‌ర్తీకి వీలైనంత త్వ‌ర‌గా ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి తీసుకోవాల‌ని సీఎస్ సూచించారు. గ్రూప్‌-4 కేడ‌ర్ కింద 9,168 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అసెంబ్లీ వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Next Story