నాంపల్లి స్పెషల్ కోర్ట్‌లో కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్
మాజీ మంత్రి కేటీఆర్‌పై నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 12:45 PM GMTమాజీ మంత్రి కేటీఆర్‌పై నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్‌రెడ్డి కోర్టుకెక్కారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. 2011లో శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభమయ్యింది.. శోధ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవరిస్తున్నారు.. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేదు.. తాను డైరెక్టర్‌ను కూడా కాదు.. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు.
అమృత్ 2లో ప్యాకేజ్ 1 కాంట్రాక్ట్‌ను AMR-శోధ-IHP జాయింట్ వెంచర్‌గా దక్కించుకుందని.. జాయింట్ వెంచర్‌లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతమే వాటానేనని వెల్లడించారు. అమృత్ పనులకు e-టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించారు.. పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. మాజీ మంత్రిగా కేటీఆర్‌కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందని.. అయినా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని.. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్‌రెడ్డి పేర్కొన్నారు.