పటాకుల దుకాణాలు మూసివేయండి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Crackers ban..Ts Government key decisions.. దీపావళి పండగ సంబరాలపై తెలంగాణ హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు

By సుభాష్  Published on  13 Nov 2020 11:29 AM IST
పటాకుల దుకాణాలు మూసివేయండి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

దీపావళి పండగ సంబరాలపై తెలంగాణ హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టపాకాయల అమ్మకాలు, వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. టపాకాయల దుకాణాలు తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా మహమ్మారి సమయంలో పటాకులు కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ కోవిడ్‌ వైరస్‌ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్నవారికి, కోవిడ్‌ బాధితులు ఇబ్బందులు పడతారని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న కోర్టు టపాసులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పండగల కంటే ప్రాణాలే ముఖ్యమని పేర్కొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం విధించిందని కోర్టు గుర్తు చేసింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. తెరిచివున్న దుకాణాలను సైతం మూసివేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పటాకులు కాల్చకుండా ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపింది. దుకాణదారులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Next Story